
TVS Motor Company : భారత్ లోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో టీవీఎస్ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటి, టీవీఎస్ iQube ప్రజాదరణ పొందుతూ.. నెలవారీగా స్థిరమైన అమ్మకాలను నమోదు చేస్తోంది.
అయితే టీవీఎస్ మరింత సరసమైన ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పనిచేస్తోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఆటోకార్ ఇండియా ప్రకారం, కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ కంటే తక్కువగా ఉంటుంది. కొత్త ఈవీ పండుగ సీజన్‌కు ముందు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
టీవీఎస్ సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అంచనాలు
ప్రస్తుతం, TVS iQube శ్రేణి ధరలు 2.2 kWh బ్యాటరీతో బేస్ వేరియంట్‌కు రూ. 1 లక్ష నుంచి ప్రారంభమవుతాయి. 5.1kWh బ్యాటరీతో రేంజ్-టాపింగ్ ST ట్రిమ్‌కు దాదాపు రూ. 2 లక్షల వరకు (రెండూ ఎక్స్-షోరూమ్) ఉంటాయి. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సరళమైన భాగాలు, తక్కువ ఫీచర్లు, చిన్న బ్యాటరీ ప్యాక్‌తో లక్ష రూపాయల లోపు ఆఫర్‌గా ఉండనుంది.
రాబోయే బ్యాటరీతో నడిచే స్కూటర్ గురించిన విరాలు ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు.కానీ ఇది బాష్ నుంచి తీసుకోబడిన iQube యొక్క ఎంట్రీ-లెవల్ వేరియంట్ల వంటి సాధారణ హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. ఇది ఖర్చులను తగ్గిస్తుంది. పరిధి 70-75 కి.మీ ఉంటుంది. అంటే రోజువారీ ప్రయాణాలకు స్కూటర్ కోసం చూస్తున్న వారికి ఇది సరిపోతుంది.
TVS Motor Company : ఏ పేరుతో వస్తోంది..
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఏ పేరు పెడతారో ఇంకా తెలియరాలేదు, కానీ “జూపిటర్” బ్రాండ్ ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని, టీవీఎస్ జూపిటర్ ఎలక్ట్రిక్ పేరును పెట్టవచ్చు, హోండా, సుజుకి తమ బలమైన నేమ్ప్లేట్లను – యాక్టివా, యాక్సెస్ – తమ ఇ-స్కూటర్ల కోసం ఎలా ఉపయోగించుకున్నాయో అదే విధంగా జూపిటర్ పేరుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోతోంది. . అలా చేస్తే, జుజుపిటర్ పెట్రోల్, సిఎన్జి, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభించే మొట్టమొదటి ద్విచక్ర వాహనం అవుతుంది. జూపిటర్ యొక్క సిఎన్జి వెర్షన్ రూపకల్పనకు తెరవెనుక కసరత్తు జరుగుతోంది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోండి..