EV Scooter | మార్కెట్ లోకి మరో సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్
Zelio E Mobility | జెలియో ఇ మొబిలిటీ సంస్థ నుంచి లెజెండర్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ (EV Scooter) యొక్క ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అప్డేట్ చేసిన ద్విచక్ర వాహన EV, సరికొత్త డిజైన్, కొత్త రంగులు, మెరుగైన స్పెసిఫికేషన్స్ తో ఇది వస్తోంది. కొత్త Zelio Legender స్కూటర్ .. లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో వేరియంట్ వ తక్కువ-వేగం ఇ-స్కూటర్ విభాగంలో జెలియో స్థానాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
హర్యానాకు చెందిన EV ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీదారు లెజెండర్ ఫేస్‌లిఫ్ట్ జూలైలో ప్రారంభమవుతుందని ధృవీకరించింది. ZELIO E మొబిలిటీ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ ఆర్య మాట్లాడుతూ, "లెజెండర్ చాలా కాలంగా మా పోర్ట్‌ఫోలియోలో ఇష్టమైన వాటిలో ఒకటి. దాని సామర్థ్యం, విశ్వసనీయత, రోజువారీ అవసరాలకు చక్కగా సరిపోతోందని ప్రశంసలు అందుకు...