Tag: Vida

Electric Vehicles | హీరో మోటోకార్ప్ నుంచి స‌రికొత్త‌ ఎలక్ట్రిక్ వాహనాలు
Electric Vehicles

Electric Vehicles | హీరో మోటోకార్ప్ నుంచి స‌రికొత్త‌ ఎలక్ట్రిక్ వాహనాలు

భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీదారు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp), మ‌రికొద్దిరోజుల్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ మోడళ్ల (Electric Vehicles)ను ప్ర‌వేశ‌పెట్టి త‌మ వాహ‌నా శ్రేణిని విస్తరించాలని యోచిస్తోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న‌ల‌ను సంస్థ ఇంకా విడుదల చేయలేదు. అయితే, విడా బ్రాండ్ కింద రాబోయే బ్యాటరీతో నడిచే వాహ‌నాల‌ను సూచించే మీడియా ఆహ్వానాన్ని పంపింది. నివేదికల ప్రకారం, హీరోమోటో కార్ప్ నుంచి వ‌స్తున్న‌ తదుపరి మోడల్‌లు ACPD అని పిలువబడే సరసమైన EV ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించవచ్చు. ఇవి ఎంట్రీ-లెవల్ మార్కెట్ ను ల‌క్ష్యంగా చేసుకుంటాయ‌ని అంచనా వేస్తున్నారు. ఇవి ఎక్కువ మంది మ‌ధ్య‌త‌ర‌గ‌తి EV-వినియోగదారులను ఆకర్షించేలా తక్కువ ధరలో అందుబాటులోకి రానున్నాయ‌ని తెలుస్తోంది. ఈ వాహనం గురించి కంపెనీ పెద్దగా వివరాలను అందించలేదు. అయితే, ప్రస్తుత V2 సిరీస్, ఇటీవల ప్రకటించిన Z సిరీస్ కంటే ఇది చాల...