Tag: TVS iQube

Electric scooters 2025 | లక్ష రూపాయల లోపు టాప్ 5 ఈ-స్కూటర్లు ఇవే..
Electric Vehicles

Electric scooters 2025 | లక్ష రూపాయల లోపు టాప్ 5 ఈ-స్కూటర్లు ఇవే..

2025 Top Electric scooters Under Rs One lakh | కొన్నాళ్లుగా పెట్రోల్ ధరలు ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో వాహనదారులు ఇపుడు ఎలక్ట్రిక్ వాహనాలపై చూస్తున్నారు. ఇదే సమయంలో పలు కార్పొరేట్ కంపెనీలు సైతం ఉన్నత, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ధరలోనే విభిన్న రకాలైన ఈవీ (EV) మోడళ్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగానికి ఆర్థిక సంవత్సరంలో 2025 ఏప్రిల్ లో అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాలు (Electric scooters) అమ్ముడయ్యాయి. వాహన్ డేటా ఆధారంగా, గత నెలలో భారతదేశంలో స్కూటర్లు, బైక్‌లు, మోపెడ్‌లతో సహా 91,791 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు (E2Wలు) అమ్ముడయ్యాయి. ఇది 40% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఇది 2023లో ఏప్రిల్‌లో జరిగిన మునుపటి ఉత్తమ అమ్మకాలను మించిపోయింది. మార్కెట్లో రూ. 1 లక్ష లోపు డబ్బుకు అత్యంత విలువైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ఒకసారి లుక్కేయండి.. ...
TVS iQube ని ఒక సక్సెస్ ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మారడానికి కారణాలు ఏమిటి?
Electric Vehicles

TVS iQube ని ఒక సక్సెస్ ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మారడానికి కారణాలు ఏమిటి?

TVS iQube ఒక విజయవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని అద్భుతమైన డిజైన్, ఆకట్టుకునే పనితీరుతో ఈవీ వినియోగదారుల మన్ననలు పొందుతోంది. TVS iQube బేస్ మోడల్ ధర రూ. 1.07 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇందులో 2.2kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుపరిచారు. ఇది 75kmph రియల్ రేంజ్ ఇస్తుుంది. గంటకు 75kmph గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. దీనితోపాటు వచ్చే ఆఫ్-బోర్డ్ ఛార్జర్‌తో 2 గంటల 45 నిమిషాల్లో 0-80% వరకు ఛార్జ్ చేయబడుతుందని TVS Motor company చెబుతోంది. రైడర్లకు కావాల్సిన కనీస సౌకర్యాలు.. ఈ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్, కాంబో-బ్రేకింగ్ సిస్టమ్, డిజిటల్ డాష్, LED లైటింగ్, హెల్మెట్‌కు సరిపోయేంత అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. కాబట్టి మొత్తం మీద, ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి తగినంత ఫీచర్లతో కూడిన స్కూటర్. TVS iQube : వాస్తవ అనుభవం ఇలా.. ...