హైదరాబాద్ కు 2వేల ఎలక్ట్రిక్ బస్సులు – PM e drive scheme
హైదరాబాద్ నగర వాసులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం (PM e drive scheme) కింద 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హైదరాబాద్‌కు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ, గుజరాత్, దిల్లీ, కర్ణాటక రాష్ట్రాలకు బస్సుల కేటాయింపుపై దృష్టి సారించారు. ఈ పథకం కింద హైదరాబాద్‌తో పాటు బెంగళూరుకు 4,500, దిల్లీకి 2,800, అహ్మదాబాద్‌కు 1,000, సూరత్‌కు 600 ఎలక్ట్రిక్ బస్సులను అందజేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ఈవిషయమై కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రస్తుతం సుస్థిర పట్టణ రవాణా దిశగా వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు. బెంగళూరు నుంచి దిల్లీ వరకు, నగరాలు ...