Green Power | భవిష్యత్తు అంతా గ్రీన్ పవర్‌దే..
పిన్నాపురం (కర్నూలు జిల్లా): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికల్లో గ్రీన్ ఎనర్జీ (Green Power) కి అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే రూ. లక్ష కోట్ల విలువైన గ్రీన్ పవర్ ఒప్పందాలు (MOUలు) జరిగాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పిన్నాపురం గ్రామంలో శనివారం గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తోందని తెలిపారు. ఇప్పటికే 2025 న్యూ ఎనర్జీ పాలసీ (New Energy Policy) ని తమ సర్కారు తీసుకొచ్చిందని చెప్పారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా కొత్త మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తిని అన్వేషిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మిగులు విద్యుత్ సాధించే దిశగా కృషి చేస్త...