PM Surya Ghar ఇన్‌స్టలేషన్ లో దేశంలోనే ఈ రాష్ట్రం టాప్..
PM Surya Ghar Yojana | ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 3.05 లక్షల సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్‌ల ఇన్‌స్టలేషన్ (PM surya ghar installation) లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గుజరాత్ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ ( GUVNL ) విడుదల చేసిన డేటా ప్రకారం, మే 11, 2025 నాటికి, ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద గుజరాత్‌లో 3.36 లక్షల సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్‌లను ఏర్పాటు చేశారు, ఇది మొత్తం దేశంలోనే అత్యధికం. అద్భుతమైన ఈ పథకంతో నేడు దేశంలోని సోలార్ రూఫ్ టాప్ (Solar panels) ఇన్‌స్టాలేషన్ లో గుజరాత్ మాత్రమే 34% వాటాను కలిగి ఉంది. ఈ పథకం కింద గుజరాత్‌లోని 3.03 లక్షల మంది వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ₹ 2362 కోట్ల సబ్సిడీని అందించింది.
PM Surya Ghar Yojana : దేశంలోని టాప్ ఐద...