PM Kisan | 10 కోట్ల మంది రైతులకు భారీ శుభవార్త
వచ్చే నెలలోనే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల
PM Kisan Samman Nidhi | దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది రైతులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 2025 జూన్ నాటికి రూ. 2,000 అన్నదాతల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది. ఈ స్కీమ్ (PM Kisan Yojana ) ద్వారా రైతులకు అందుతున్న 20వ విడత ఆర్థిక సహాయం అందించనున్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడం ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం. అయితే దీనికి గురించి ప్రభుత్వం ఇంకా కచ్చితమైన తేదీని ప్రకటించకపోయినప్పటికీ జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చివరి విడత డబ్బు రూ. 2000 ను ప్రధాన మంత్రి మోదీ 2025 ఫిబ్రవరి 24న బీహార్ లోని భాగల్ పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఈ ప్రయోజనం చేకూరింది. తర్వాత PM Kisan ఇన...