Turmeric board | నిజామాబాద్ నుంచి దేశవ్యాప్తంగా పసుపు వికాసం..
పసుపు బోర్డు ప్రారంభించిన అమిత్ షా
భారత్ పసుపుకు అంతర్జాతీయ గుర్తింపు లక్ష్యం
ఎగుమతులకు ఊతమిస్తుందని కేంద్ర మంత్రి హామీ
నిజామాబాద్ (nizamabad ) లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని(Turmeric board ) కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (home minister amit shah) ఆదివారం లాంచనంగా ప్రారంభించారు.. అలాగే పసుపు బోర్డు కార్యాలయంలో ఏర్పా టు చేసిన పసుపు ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన కిసాన్ సమ్మేళన్ సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.షా..నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకోసం ఎంపీ అర్వింద్కేంద్రంతో కొట్లాడారని గుర్తుచేశారు.
జాతీయ పసుపు బోర్డు (Turmeric board) లక్ష్యాలు
పసుపు పంటపై అవగాహన, వినియోగం పెంచడం
భారతదేశంలో పసుపు వినియోగాన్ని పెంచే లక్ష్యంతో, దాని...