Tag: Matter

Matter Aera | ఈవీ మార్కెట్ లో గేమ్-ఛేంజర్..  ఈ ఎల‌క్ట్రిక్ బైక్ కొంటే బ్యాట‌రీపై జీవిత‌కాలం వారంటీ..
Electric Vehicles

Matter Aera | ఈవీ మార్కెట్ లో గేమ్-ఛేంజర్.. ఈ ఎల‌క్ట్రిక్ బైక్ కొంటే బ్యాట‌రీపై జీవిత‌కాలం వారంటీ..

ఈవీ త‌యారీ కంపెనీ మాట‌ర్ ఎన‌ర్జీ (Matter Energy) తన ఎలక్ట్రిక్ మోటార్‌బైక్ అయిన ఏరా (Matter Aera ) కు మొట్టమొదటిసారిగా లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించింది. భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మొబిలిటీ రంగంలో మ్యాటర్ గేమ్ చేంజ‌ర్ గా నిలిచింది. దేశంలో మొట్టమొదటి ఆఫర్ మ్యాటర్ కేర్ ప్రోగ్రామ్ కింద అందుబాటులో ఉంది. ఇది బ్యాటరీ లైఫ్‌, కొత్త బ్యాట‌రీ మార్పిడి ఖర్చులపై సాధార‌ణంగా EV కొనుగోలుదారులలో ఆందోళ‌న‌ల‌ను త‌గ్గిస్తుంది. “మీరు MATTER తో రైడ్ చేసినప్పుడు, మేము మీతో పాటు ప్రయాణిస్తాం.. అదీ జీవితాంతం. తమ బైక్‌కు శక్తినిచ్చే బ్యాట‌రీల‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ జీవితకాల బ్యాటరీ వారంటీతో మేము మీకు మద్దతు ఇస్తున్నాం, ”అని MATTER వ్యవస్థాపకుడు & CEO మోహల్ లాల్‌భాయ్ అన్నారు. “ఇది ఒక సాహసోపేతమైన అడుగు. ఎక్కువ మంది ప్రజలు ఈవీల‌ను స్వీకరించాలని మేము కోరుకుంటున్నాము. ఆ ప్ర...