ZELIO E-Mobility | ఒకే ఛార్జ్‌తో 120 కిమీ రేంజ్ – గిగ్ వర్కర్లకు ఊరట!
ZELIO E-Mobility జూలై 2025లో తన Logix కార్గో స్కూటర్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఆవిష్కరించనుంది. ఇది మునుపటి మోడల్ 90-కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగా కొత్త వేరియంట్ సింగిల్ ఛార్జ్‌కు 120 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. హర్యానాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీదారు ఈరోజు లాంచ్‌ను ప్రకటించింది.
ఆధునీకరించిన లాజిక్స్ (Logix ) ఎలక్ట్రిక్ స్కూటర్ గిగ్ వర్కర్లు, డెలివరీ బాయ్స్, లాస్ట్ మైల్ లాజిస్టిక్స్ కార్యకలాపాల కోసం తీసుకువచ్చారు. స్కూటర్ లో 60/72V BLDC మోటార్ కాన్ఫిగరేషన్, 25 కిమీ/గం గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఈ వాహనం 150 కిలోగ్రాముల వరకు లోడ్‌లను మోయగలదు. పూర్తి ఛార్జ్‌కు 1.5 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది.
ఈ స్కూటర్ బూడిద, ఆకుపచ్చ రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. పట్టణ, సెమీ-అర్బన్ మార్కెట్లలో అధిక-వాల్యూమ్ డెలివరీ అవసరాలకు పరిష్కారంగా కంపెనీ నవీకరించబడిన మోడల్‌ను అందుబాటులోకి తీసుక...