సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు – Jeeluga seeds
హైదరాబాద్ : వానాకాలం 2025 కి గాను పచ్చిరొట్ట విత్తనాలను (Jeeluga seeds) సబ్సిడీపై పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, నేషనల్ సీడ్ కార్పొరేషన్ విత్తనాల ద్వారా పంపిణీ చేయడానికి వ్యవసాయశాఖ ఒప్పందం చేసుకుంది. . ఇప్పటివరకు 89,302.10 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను ఆగ్రో రైతు సేవ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పంపిణీకి సిద్ధం చేసింది. ఇప్పటివరకు 1,17,912 మంది రైతులు 56,262.10 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను కొనుగోలు చేశారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 33,040 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.
అయితే నేషనల్ సీడ్ కార్పోరేషన్ తమకు కేటాయించిన జిలుగ విత్తనాల ఇండెట్ కు బదులు ఇతర రాష్ట్రాలలో పంపిణీ చేస్తున్న 5 రకాల విత్తనాలు గల 5kg కిట్లను సరఫరా చేయడానికి ముందుకు రాగా, రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, రైతులక...