TVS Motor Company : మరో కొత్త సరసమైన TVS ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోందా?
TVS Motor Company : భారత్ లోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో టీవీఎస్ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటి, టీవీఎస్ iQube ప్రజాదరణ పొందుతూ.. నెలవారీగా స్థిరమైన అమ్మకాలను నమోదు చేస్తోంది.
అయితే టీవీఎస్ మరింత సరసమైన ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పనిచేస్తోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఆటోకార్ ఇండియా ప్రకారం, కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ కంటే తక్కువగా ఉంటుంది. కొత్త ఈవీ పండుగ సీజన్‌కు ముందు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
టీవీఎస్ సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అంచనాలు
ప్రస్తుతం, TVS iQube శ్రేణి ధరలు 2.2 kWh బ్యాటరీతో బేస్ వేరియంట్‌కు రూ. 1 లక్ష నుంచి ప్రారంభమవుతాయి. 5.1kWh బ్యాటరీతో రేంజ్-టాపింగ్ ST ట్రిమ్‌కు దాదాపు రూ. 2 లక్షల వరకు (రెండూ ఎక్స్-షోరూమ్) ఉంటాయి. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సరళమైన భాగాలు, తక్కువ ఫీచర్లు, చిన్న బ్యాటరీ ప్యాక్‌తో లక్ష రూపాయల లోపు ఆఫర్‌గా ...