Oil Palm | ఒకే రోజు 557 ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్..
Oil Palm Plantation | రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల , మంచాల, కందుకూరు, తలకొండపల్లి, ఫరుఖ్ నగర్ మండలాలలోని 111 మంది రైతులకు సంబంధించిన 557 ఎకరాలలో సుమారు 32000 ఆయిల్ పామ్ మొక్కలు నాటారు.చేవెళ్ల మండలం, దేవుని ఎర్రవెల్లిలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.12,000 మాత్రమే ఉందని, కాని తమ ప్రభుత్వ కృషి కారణంగా ఇప్పుడు ధర రూ. 18748 గా చేరిందని అన్నారు. రైతులు సంప్రదాయ పంటల స్థానంలో వాణిజ్య పంటలైన ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలని కోరారు. ఒకసారి ఆయిల్ పామ్ పంట సాగు చేస్తే దాదాపు 30 ఏళ్ల వరకు ఆదాయం వస్తుందని అన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ఆయిల పామ్ పంటలకు డ్రిప్ పరికరాలు సబ్సిడీపై అందజేయాలన్నారు. ఎంఐడీహెచ్ పథక...