Tag: Green Public Transport Telangana

Suryapet | రోడ్లపైకి కొత్తగా మరో 45 ఎలక్ట్రిక్ బస్సులు
General News

Suryapet | రోడ్లపైకి కొత్తగా మరో 45 ఎలక్ట్రిక్ బస్సులు

పర్యావరణహిత రవాణాకు మరో ముందడుగు Suryapet | సూర్యాపేట జిల్లాలో కొత్తగా 45 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో 45 ఎలక్ట్రిక్ బస్సులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంత‌రం మంత్రులు, ఎమ్మెల్యేలు ఎల‌క్ట్రిక్ బస్సులో ప్రయాణించారు. రాష్ట్రంలో కాలుష్యం, క‌ర్బ‌న‌ ఉద్గారాల‌ను త‌గ్గించేందుకు డీజిల్ వాడకాన్ని ప‌రిమితం చేయాల‌నే లక్ష్యంతో త‌మ‌ ప్రభుత్వం ఎల‌క్ట్రిక్ బస్సులపై దృష్టి పెట్టింద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క అన్నారు. సూర్యాపేట ఆర్‌టీసీ డిపోకు  79 బ్యాటరీ బస్సులు మంజూరు కాగా ఈరోజు 45 బ్యాటరీ బస్సులు ప్రారంభించుకోవడం చారిత్రాత్మకమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం ఈవీ బస్ులను ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాద్ మహా నగరాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు ఓఆర్ఆర్ (ORR) లోపల 2800 బ్య...