Tag: Electric vehicles

Electric vehicles

Hero Vida VX2 | హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ జూలై 1న డ్యూయల్ వేరియంట్లతో విడుదల
Electric Vehicles

Hero Vida VX2 | హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ జూలై 1న డ్యూయల్ వేరియంట్లతో విడుదల

హీరో మోటోకార్ప్ (Heromoto Corp) కంపెనీ విడా వీఎక్స్‌2 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ (Vida VX2 Electric Scooter)ను జూలై 1న‌ విడుదల చేస్తోంది. రెండు వేరియంట్లలో వస్తున్న ఈ స్కూటర్ 100 కి.మీ రేంజ్ ఇస్తుంది. గత వేరియంట్ల మాదిరిగానే ఇందులో కూడా డిటాచ‌బుల్ బ్యాటరీని కొనసాగిస్తోంది. హీరో మోటోకార్ప్ కొత్త స్కూటర్ అధికారిక లాంచ్ కు ముందు, స్కూటర్ గురించి అనేక కీలక వివరాలు వెల్లడయ్యాయి. VX2 ప్రస్తుతం ఉన్న V2 లైనప్ కు బడ్జెట్-ఫ్రెండ్లీ స్కూట‌ర్ గా నిల‌వ‌నుంది. ముఖ్యంగా ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ను తొల‌గించి బదులుగా డ్రమ్ బ్రేక్ లతో వస్తుంది. డిజైన్ పరంగా, Vida VX2 Electric Scooter క్లీన్, సింపుల్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ తెలుపు, ఎరుపు, నీలం, పసుపు, నారింజ, నలుపు, బూడిద రంగులతో సహా మోనోటోన్ రంగులలో వ‌స్తుంది. ఇది విడా V2 మోడళ్లలో అందుబాటులో ఉన్న డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లను వ‌దులుకుంద‌ని చెప్...
Bajaj Chetak 3001: చవకైన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో లాంచ్‌కి సిద్ధం!
Electric Vehicles

Bajaj Chetak 3001: చవకైన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో లాంచ్‌కి సిద్ధం!

బజాజ్ ఆటో (Bajaj Auto) తన ఎంట్రీ-లెవల్ రెండవ తరం చేతక్‌ను త్వరలో విడుదల చేయడానికి సిద్ధమ‌వుతోంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చేతక్ 3001 (Bajaj Chetak 3001) అని నామ‌క‌రం చేసిన‌ట్లు తెలుస్తోంది. వాహన్ డేటా ప్రకారం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ మే 2025లో 1,00,266 యూనిట్లను నమోదు చేసింది. ఇది సంవత్సరానికి 30% వృద్ధిగా నమోదైంది. బజాజ్ ఆటో మే నెలలో 21,770 యూనిట్లతో రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది 24,560 యూనిట్లను విక్రయించిన టీవీఎస్ మోటార్ కంటే వెనుకబడి ఉంది. ఓలా ఎలక్ట్రిక్ 18,499 యూనిట్ల అమ్మకాలతో మూడవ స్థానంలో నిలిచింది. Bajaj Chetak 3001 : ఏయే ఫీచర్లు ఉంటాయి? ప్రస్తుతం, కొత్త చేతక్ 3001 అత్యంత సరసమైన ట్రిమ్ అయిన 2903 మోడల్‌కు ప్రత్యామ్నాయంగా ఉంటుందో లేదో బజాజ్ ఆటో ఇంకా ధృవీకరించలేదు. ఏదైనా సరే, కొత్త వేరియంట్ బజాజ్ అమ్మకాల సంఖ్యలను పెంచుతుందని భావిస్తున్నారు. చేతక్ 3001 కొత...
హైదరాబాద్ కు 2వేల ఎలక్ట్రిక్ బస్సులు – PM e drive scheme
General News

హైదరాబాద్ కు 2వేల ఎలక్ట్రిక్ బస్సులు – PM e drive scheme

హైదరాబాద్ నగర వాసులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం (PM e drive scheme) కింద 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హైదరాబాద్‌కు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయించాల‌ని నిర్ణయించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ, గుజరాత్, దిల్లీ, క‌ర్ణాట‌క‌ రాష్ట్రాలకు బస్సుల కేటాయింపుపై దృష్టి సారించారు. ఈ పథకం కింద హైదరాబాద్‌తో పాటు బెంగళూరుకు 4,500, దిల్లీకి 2,800, అహ్మదాబాద్‌కు 1,000, సూరత్‌కు 600 ఎలక్ట్రిక్ బస్సులను అందజేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈవిష‌య‌మై కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో భార‌త‌దేశం ప్రస్తుతం సుస్థిర పట్టణ రవాణా దిశగా వేగంగా అడుగులు వేస్తోంద‌ని అన్నారు. బెంగళూరు నుంచి దిల్లీ వరకు, నగరాలు ...
Oben Electric | 100cc పెట్రోల్ బైక్‌లకు పోటీగా కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించిన ఒబెన్ ఎలక్ట్రిక్
Electric Vehicles

Oben Electric | 100cc పెట్రోల్ బైక్‌లకు పోటీగా కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించిన ఒబెన్ ఎలక్ట్రిక్

Oben Electric : బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికిల్ స్టార్టప్, ఒబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric), తన తదుపరి ఈవీని ఆవిష్కరించింది. 100cc సమానమైన మోటార్‌సైకిల్ విభాగంలో ప్రవేశించేందుకు O100 ప్లాట్‌ఫామ్ ను రూపొందించింది. బెంగళూరులోని ఒబెన్ యొక్క R&D హబ్‌లో నిర్మించబడిన ఈ కొత్త ప్లాట్‌ఫామ్, భారతదేశంలోని రోజువారీ ప్రయాణికులకు ఎలక్ట్రిక్ మొబిలిటీని సరసమైనదిగా మార్చడంలో ఒక కీలకమైన అడుగుగా భావించవచ్చు. దేశ ద్విచక్ర వాహన మార్కెట్లో 100cc విభాగం దాదాపు 30% ఆక్రమిస్తోంది. రూ. లక్ష కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ప్రవేశపెట్టడం ద్వారా ఒబెన్ తనదైన ముద్ర వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవతో, ఒబెన్ కంపెనీ పట్టణ, గ్రామీణ భారతదేశంలో పెట్రోల్‌తో నడిచే బైక్‌లకు ప్రత్యామ్నాయాన్ని అందించాలని యోచిస్తోంది. O100 ప్లాట్‌ఫామ్ మాడ్యులర్, భవిష్యత్తుకు సిద్ధంగా ఉంది, బహుళ వేరియంట్‌లు. బ్యాటరీ...
TVS iQube ని ఒక సక్సెస్ ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మారడానికి కారణాలు ఏమిటి?
Electric Vehicles

TVS iQube ని ఒక సక్సెస్ ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మారడానికి కారణాలు ఏమిటి?

TVS iQube ఒక విజయవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని అద్భుతమైన డిజైన్, ఆకట్టుకునే పనితీరుతో ఈవీ వినియోగదారుల మన్ననలు పొందుతోంది. TVS iQube బేస్ మోడల్ ధర రూ. 1.07 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇందులో 2.2kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుపరిచారు. ఇది 75kmph రియల్ రేంజ్ ఇస్తుుంది. గంటకు 75kmph గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. దీనితోపాటు వచ్చే ఆఫ్-బోర్డ్ ఛార్జర్‌తో 2 గంటల 45 నిమిషాల్లో 0-80% వరకు ఛార్జ్ చేయబడుతుందని TVS Motor company చెబుతోంది. రైడర్లకు కావాల్సిన కనీస సౌకర్యాలు.. ఈ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్, కాంబో-బ్రేకింగ్ సిస్టమ్, డిజిటల్ డాష్, LED లైటింగ్, హెల్మెట్‌కు సరిపోయేంత అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. కాబట్టి మొత్తం మీద, ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి తగినంత ఫీచర్లతో కూడిన స్కూటర్. TVS iQube : వాస్తవ అనుభవం ఇలా.. ...
MG మోటార్స్ నుంచి 52.9 kWh బ్యాటరీ ప్యాక్ తో ‘Windsor EV Pro’
Electric Vehicles

MG మోటార్స్ నుంచి 52.9 kWh బ్యాటరీ ప్యాక్ తో ‘Windsor EV Pro’

MG Windsor EV Pro | ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌తో MG మోటార్ ఇండియా 'Windsor EV Pro 'ని విడుదల చేసింది, ఇది మెరుగైన ఫీచర్లు, మెరుగైన డిజైన్‌ తో వచ్చింది. ఈ విండోస్ EV ప్రో 52.9 kWh బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కి.మీ. రేంజ్ ను అందిస్తుంది. ఇది మునుపటి 38 kWh బ్యాటరీ కంటే భారీ మెరుగుదల. ఇది సుమారు 331 కి.మీ. రేంజ్ ను అందించింది. MG Windsor EV Pro : స్పెసిఫికేషన్స్ సెలాడాన్ బ్లూ, గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్ అనే మూడు కొత్త రంగులలో వస్తున్న ప్రో వేరియంట్, దాని సిగ్నేచర్ ఏరోగ్లైడ్ డిజైన్‌ను కొనసాగించింది. కానీ కొత్త డ్యూయల్-టోన్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను పరిచయం చేసింది. కారు లోపలి డిజైన్ పరిశీలిస్తే ఇందులో తేలికైన ఐవరీ లెథరెట్ అప్హోల్స్టరీతో ఎక్కువ స్థలాన్ని అందించింది. ఈ కారులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) సూట్ అమర్చ...