Bajaj Chetak 3001: చవకైన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో లాంచ్‌కి సిద్ధం!
బజాజ్ ఆటో (Bajaj Auto) తన ఎంట్రీ-లెవల్ రెండవ తరం చేతక్‌ను త్వరలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చేతక్ 3001 (Bajaj Chetak 3001) అని నామకరం చేసినట్లు తెలుస్తోంది. వాహన్ డేటా ప్రకారం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ మే 2025లో 1,00,266 యూనిట్లను నమోదు చేసింది. ఇది సంవత్సరానికి 30% వృద్ధిగా నమోదైంది. బజాజ్ ఆటో మే నెలలో 21,770 యూనిట్లతో రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది 24,560 యూనిట్లను విక్రయించిన టీవీఎస్ మోటార్ కంటే వెనుకబడి ఉంది. ఓలా ఎలక్ట్రిక్ 18,499 యూనిట్ల అమ్మకాలతో మూడవ స్థానంలో నిలిచింది.
Bajaj Chetak 3001 : ఏయే ఫీచర్లు ఉంటాయి?
ప్రస్తుతం, కొత్త చేతక్ 3001 అత్యంత సరసమైన ట్రిమ్ అయిన 2903 మోడల్‌కు ప్రత్యామ్నాయంగా ఉంటుందో లేదో బజాజ్ ఆటో ఇంకా ధృవీకరించలేదు. ఏదైనా సరే, కొత్త వేరియంట్ బజాజ్ అమ్మకాల సంఖ్యలను పెంచుతుందని భావిస్తున్నారు. చేతక్ 3001 కొత...