Bridgeston | బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా నుంచి మహిళల ఆధ్వర్యంలో పండ్ల తోటలు
Madhya Pradesh : బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా (Bridgestone India), సొసైటీ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ అగ్రికల్చరల్ సస్టైనబిలిటీ (Sagest) సహకారంతో, మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని సులావాద్ గ్రామంలో పోషకాహార పండ్ల తోటల ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. పర్యావరణ సుస్థిరత, మహిళల సాధికారతకు అనుకూలంగా, ఈ కొత్త ప్రయత్నం ప్రారంభించింది. సులావాద్ గ్రామంలో సొసైటీ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ అగ్రికల్చరల్ సస్టైనబిలిటీ (SAGEST తో కలిసి “ఆర్చర్డ్ ప్రాజెక్ట్”ను ప్రారంభించింది.ఈ ప్రాజెక్టులో భాగంగా, 4 ఎకరాల్లో విస్తరించి ఉన్న తోటలో 1300 పైగా పండ్ల మొక్కలు నాటారు. గ్రామీణ మహిళలు తోట నిర్వహణను స్వయంగా చేపట్టి, సేంద్రియ విధానంలో నర్సరీలు, కంపోస్ట్ తయారీలో శిక్షణ పొందడంతోపాటు ఉపాధి లభించనుంది. సుస్థిరమైన వ్యవసాయం ద్వారా గ్రామీణ మహిళలకు తోడ్పాటునందించడం, పర్యావరణ పద్ధతులను ప్రోత్సహించడం పోషకాహార శ్రేయస్సుకు దోహదపడటం ఈ క...