Bengaluru | నగరంలో120 ఎకరాల అటవీ భూమిలో ఆక్రమణల తొలగింపు
బెంగళూరు (Bengaluru) తూర్పు తాలూకాలోని బిదరహళ్లి హోబ్లిలో ఉన్న కడుగోడి తోటలోని సర్వే నంబర్ 1లోని 120 ఎకరాల ఆక్రమణకు గురైన అటవీ భూమిని అటవీ శాఖ సోమవారం స్వాధీనం చేసుకుంది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆదేశాల మేరకు బెంగళూరు అర్బన్ ఫారెస్ట్ డివిజన్ అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టారు.
భారీ యంత్రాల సహాయంతో, గట్టి పోలీసు భద్రత నడుమ ఈ డ్రైవ్ నిర్వహించబడిందని ఒక అధికారి తెలిపారు. ఆక్రమణలను తొలగించిన తర్వాత, ఆ శాఖ అటవీ భూమి సరిహద్దులను గుర్తించి, దీర్ఘకాలిక పర్యావరణ పునరుద్ధరణ ప్రయత్నంలో భాగంగా ఆ ప్రాంతంలో మొక్కలను నాటారు.
"అటవీ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. ఈ ఆపరేషన్‌లో భాగంగా, నగరంలో పచ్చదాన్ని రక్షించే దిశగా మేము ఒక పెద్ద అడుగు వేశాం. వందలాది ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. గత రెండు సంవత్సరాలుగా నిరంతర ప్రయత్నాల ద్వారా, బెంగళూరు న...