Bajaj Chetak 3001 : సింగిల్ ఛార్జ్‌తో 127 కిలోమీటర్లు… ధర రూ. 99,990 మాత్రమే!
Bajaj Chetak 3001 | బజాజ్ ఆటో కొత్తగా చేతక్ 3001 ఎలక్ట్రిక్‌స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,990. చేతక్ 2903 స్థానంలో వచ్చిన కొత్త చేతక్ 3001 వేరియంట్ అత్యంత సరసమైన ఈవీ స్కూటర్ గా చెప్పవచ్చు. ఈవీ లాంచ్ సందర్భంగా బజాజ్ ఆటో లిమిటెడ్ అర్బనైట్ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు ఎరిక్ వాస్ మాట్లాడుతూ, “చేతక్ 3001 ఎలక్ట్రిక్ స్కూటర్లను విస్తృతంగా స్వీకరించడానికి బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుందని తెలిపారు. నెక్ట్స్ జనరేషన్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన కొత్త స్కూటర్ భారతీయ వాహనదారులు కోరుకునే రేంజ్, పనితీరును అందిస్తుంది.
Bajaj Chetak 3001 : స్పెసిఫికేషన్స్
కొత్త చేతక్ 3001 కొత్త సెకండ్ జనరేషన్ చేతక్ 35 సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైంది. ఇది 35-లీటర్ బూట్ స్థలాన్ని కలిగి ఉంటుంది. దీని కొత్త ఫ్లోర్‌బోర్డ్-మౌంటెడ్ 3 kWh బ్యాటరీ ఆర్కిటెక్చర్ 127 కి.మీ రేంజ్ ని...