Ather Energy Q4 results : అధిక ఆదాయంతో నష్టాలతను రూ.234.4 కోట్లకు తగ్గుదల
Ather Energy Q4 results : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అథర్ ఎనర్జీ లిమిటెడ్ 2024-25 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో రూ.234.4 కోట్ల నష్టాన్ని నివేదించింది, గత సంవత్సరం నాల్గవ త్రైమాసిక నష్టం రూ.283.3 కోట్లతో పోలిస్తే ఇది 17 శాతం తగ్గుదల. నాల్గవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.676.1 కోట్లుగా నమోదైందని, గత ఏడాది క్యూ4 ఆదాయం రూ.523.4 కోట్లతో పోలిస్తే ఇది ఏడాదికి 29 శాతం ఎక్కువని కంపెనీ తెలిపింది.ఏథర్ ఎనర్జీ (Ather Energy) మే 6, 2025న స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది, BSE, NSE రెండింటిలోనూ ఒక్కో షేరుకు ₹328 వద్ద లిస్టింగ్ అయింది. Q4 కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం ₹687.8 కోట్లుగా నమోదైంది. ఇది గత సంవత్సరం నాల్గవ త్రైమాసిక ఫలితాల కంటే 28 శాతం పెరిగింది.
మరోవైపు సోమవారం బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.59.05 కోట్ల...