Clean Air Zones | విజయవాడ, వైజాగ్‌లలో త్వరలో క్లీన్ ఎయిర్ జోన్‌లు
Clean Air Zones in Vijayawada, Vizag : విజయవాడ, విశాఖపట్నంలోని ఎంపిక చేసిన శివారు ప్రాంతాలు క్లీన్ ఎయిర్ జోన్స్ (CAZ) ప్రాజెక్ట్ ను జూలై నెలలో మొదలు పెట్టనున్నారు. నగరాల్లో వాయు నాణ్యతను మెరుగుపరిచే దిశగా ఇది ఒక కీలక పరిణామంగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) బుధవారం CAZ (Clean Air Zones) ల దశలవారీ అమలును ప్రారంభించడానికి మల్టీ -ఏజెన్సీ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండు నగరాల మునిసిపల్ కార్పొరేషన్లు, పోలీస్, రవాణా విభాగాల నుండి కీలక అధికారులు సమావేశమయ్యారు.
క్లియర్ ఎయిర్ జోన్స్ (Clean Air Zones ) ఎక్కడ?
మొదటి దశలో విజయవాడలోని రమేష్ హాస్పిటల్ జంక్షన్, సిద్ధార్థ కాలేజ్ జంక్షన్, అలాగే విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో CAZ ను అమలు చేయనున్నారు. "దశలవారీ విధానం వల్ల అధికారులు ఈ పరిసరాలకు పరిష్కారా...