Tag: తెలంగాణ వ్యవసాయం

Rythu Nestam | 16న రైతునేస్తం కార్యక్రమం: రైతులతో ముఖాముఖి మాట్లాడనున్న సీఎం రేవంత్ రెడ్డి
Ogranic Farming

Rythu Nestam | 16న రైతునేస్తం కార్యక్రమం: రైతులతో ముఖాముఖి మాట్లాడనున్న సీఎం రేవంత్ రెడ్డి

Rythu Nestam | హైదరాబాద్ : వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈనెల 16న జరగనున్న రైతునేస్తం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రైతులతో ముఖాముఖి మాట్లాడతారని, ఆ ప్రసారాన్ని అన్ని రైతునేస్తం కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారని కలెక్టర్లకు తెలిపారు. ప్రతినిధులను ఆహ్వానించి, ప్రతి ప్రాంతం నుంచి కనీసం 250 మంది రైతులు హాజరయ్యేలా చూసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్లను కోరారు. మరో 1000 కేంద్రాల్లో అందుబాటులోకి వీడియో కాన్ఫరెన్స్ ఈ కార్యక్రమం (Rythu Nestam) ద్వారా రైతులు వ్యవసాయ నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సీఎస్ రామకృష్...