
Seshachalam | ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు కనుమల కొండ ప్రాంతాల్లో అత్యంత అరుదైన కొత్త జాతి స్కింక్ ను కనుగొన్నట్లు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐ) డైరెక్టర్ డాక్టర్ ధ్రితి బెనర్జీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జీవికి ‘డెక్కన్ గ్రాసైల్ స్కింక్ (Deccan Grassile Skink) ఆనే పేరు పెట్టారు.
లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలతో కలిసి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు ఈ జాతిని రియోపా డెక్కనెన్సిస్ లేదా దక్కన్ గ్రాసైల్ స్కింక్గా అభివర్ణించారు. ఈ అన్వేషణను పీర్-రివ్యూడ్ జర్నల్ జూటాక్సాలో ప్రచురించారు. ఎనిమిది దశాబ్దాలకు పైగా రియోపా జాతిలో వివరించి ఉన్న మొదటి కొత్త భారతీయ జాతి ఇది.
ఈ జాతిని ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం (Seshachalam) బయోస్పియర్ రిజర్వ్ తోపాటు తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి గుర్తించారు. ఇది సన్నని శరీరం, సెమీ-పారదర్శకమైన దిగువ కనురెప్పలు, విభిన్న డోర్సల్ చారలు, ఐదు వేళ్లు, ఐదు కాలివేళ్లు, 108–109 పారావెర్టెబ్రల్ స్కేల్ వరుసల ద్వారా వర్గీకరించబడుతుంది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..