
వచ్చే నెలలోనే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల
PM Kisan Samman Nidhi | దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది రైతులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 2025 జూన్ నాటికి రూ. 2,000 అన్నదాతల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది. ఈ స్కీమ్ (PM Kisan Yojana ) ద్వారా రైతులకు అందుతున్న 20వ విడత ఆర్థిక సహాయం అందించనున్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడం ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం. అయితే దీనికి గురించి ప్రభుత్వం ఇంకా కచ్చితమైన తేదీని ప్రకటించకపోయినప్పటికీ జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చివరి విడత డబ్బు రూ. 2000 ను ప్రధాన మంత్రి మోదీ 2025 ఫిబ్రవరి 24న బీహార్ లోని భాగల్ పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఈ ప్రయోజనం చేకూరింది. తర్వాత PM Kisan ఇన్ స్టాల్ మెంట్ అయిన రూ. 2,000 అకౌంట్లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా తమ ఈ కేవైసీ (E-KYC)ని పూర్తి చేయాలి. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్లో కూడా ఈ రూల్ పాటించాలని స్పష్టంగా చెప్పారు. ఈ కేవైసీ పూర్తి చేయకుంటే రూ. 2,000 మొత్తం రైతుల అకౌంట్లో జమ కాదు. అంతేకాదు రైతులు తమ భూమి రికార్డులు కూడా సరి చూసుకోవాల్సి ఉంటుంది.
బ్యాంకు అకౌంట్స్ ఆధార్ కార్డులతో లింక్ అయి ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఈ ముఖ్యమైన పనులు పూర్తవ్వకుంటే రావాల్సిన డబ్బులు అకౌంట్లో ఆగిపోతాయి. రైతులు తమ ఇళ్ల నుంచే ఓటీపీ ఆధారిత పద్ధతిలో సులభంగా ఈ కేవైసీని పూర్తి చేయవచ్చు. హోంపేజీలో కనిపించే e-KYC ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. Search పై క్లిక్ చేసి ఆ తర్వాత ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ కు OTP వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేస్తే ఇ కేవైసీ ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోండి..