
హైదరాబాద్ : వానాకాలం 2025 కి గాను పచ్చిరొట్ట విత్తనాలను (Jeeluga seeds) సబ్సిడీపై పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, నేషనల్ సీడ్ కార్పొరేషన్ విత్తనాల ద్వారా పంపిణీ చేయడానికి వ్యవసాయశాఖ ఒప్పందం చేసుకుంది. . ఇప్పటివరకు 89,302.10 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను ఆగ్రో రైతు సేవ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పంపిణీకి సిద్ధం చేసింది. ఇప్పటివరకు 1,17,912 మంది రైతులు 56,262.10 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను కొనుగోలు చేశారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 33,040 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.
అయితే నేషనల్ సీడ్ కార్పోరేషన్ తమకు కేటాయించిన జిలుగ విత్తనాల ఇండెట్ కు బదులు ఇతర రాష్ట్రాలలో పంపిణీ చేస్తున్న 5 రకాల విత్తనాలు గల 5kg కిట్లను సరఫరా చేయడానికి ముందుకు రాగా, రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, రైతులకు ఎక్కడా అసౌకర్యం జరగకుండా వాటిని కూడా తెప్పించి అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే నేషనల్ సీడ్ కార్పొరేషన్ 750 ఎన్. ఎస్.సి కిట్లను పంపిణీ చేసింది. ఈ కిట్ ధర 635 రూపాయలు. ఒక ఎకరానికి రెండు కిట్లు వాడితే సరిపోతుంది. ఇంకా 5000 కిట్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. ప్రతి సంచిలో ఒక కిలో జీలుగ, ఒక కిలో జనుము, ఒక కిలో మొక్కజొన్న, 0.5 కిలోజొన్న, 0.5 కిలోబొబ్బర్లు, ఒక కిలో గోరుచిక్కుడు విత్తనాలు ఉంటాయి. ఈ కిట్లో ఉన్న ఐదు రకాల విత్తనాలు పచ్చిరొట్ట (Jeeluga seeds)గా వాడటం వలన భూసారం పెరగడంతో పాటు కలుపు నివారణ మరియు భూమిలో నీటి నిలుపుదల సామర్థ్యం పెరుగుతుందని మంత్రిగారు పేర్కొన్నారు. కావున రైతు సోదరులు జిలుగతో పాటు ఈ కిట్లను కూడా వాడుకొని భూసారం పెంచుకోగలరని విజ్ఙప్తి చేయడమైనది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.