
EV Sales in May 2025 | ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో టీవీఎస్ (TVS Motor Company) వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. టీవీఎస్ ఐక్యూబ్ కు మార్కెట్లో భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇది హోసూర్ కు చెందిన తయారీదారు ఓలా వంటి ఇతర బ్రాండ్లను దుమ్ము దులిపి ముందంజ వేయడానికి ఈ ఐక్యూబ్ దోహదపడింది. మే 2025లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
EV Sales : మే 2025లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు
TVS, మే 2025లో 24,560 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో ఉంది. TVS దాని EV పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కలిగి ఉంది అందులో మొదటిది iQube రెండోది X. వీటిలో రెండోది దాని అమ్మకాలు, డెలివరీల విషయంలో కొంత గందరగోళం నెలకొంది.TVS iQube కొన్ని రోజుల క్రితం ధర తగ్గింపుతో పాటు రిఫ్రెష్ చేసి కొత్తవేరియంట్ ను తీసుకొచ్చింది. ఇది కంపెనీకి మరింత లాభదాయకంగా మారింది.
రెండవ స్థానంలో బజాజ్ చేతక్ (Bajaj) నిలిచింది. ఇది టీవీఎస్ కిరీటాన్ని కైవసం చేసుకునే వరకు సెగ్మెంట్ లీడర్‌గా ఉంది. మే 2025లో, బజాజ్ చేతక్ యొక్క 21,770 యూనిట్లను విక్రయించింది, ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ను అధిగమించింది. ఇక ఓలా మూడవ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. మే 2025లో, ఓలా 18,499 యూనిట్లను విక్రయించింది. ఓలా S1 శ్రేణి తిరిగి పుంజుకుంది. ధర కూడా తగ్గింది.
మే 2025లో 12,840 యూనిట్ల అమ్మకాలతో ఏథర్ ఎనర్జీ నాల్గవ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన రిజ్టా అమ్మకాల సంఖ్య 1 లక్షను అధిగమించే మైలురాయిని కూడా ఏథర్ ఎనర్జీ సాధించింది. చివరగా, మే 2025కి 7,164 యూనిట్లను విక్రయించి హీరో (Hero MotoCorp) టాప్ ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలలో చోటు దక్కించుకుంది. హీరో విడా కూడా ఇటీవలే రిఫ్రెష్ అయ్యింది. మే 2025 అమ్మకాలతో, విడా బ్రాండ్ వాహన్ మార్కెట్ వాటా 7.2% కలిగి ఉంది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
[…] ధరను ఇంకా ప్రకటించలేదు. బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, అథర్ రిజ్టా, హీరో విడా వంటి ప్రముఖ […]