Suryapet | రోడ్లపైకి కొత్తగా మరో 45 ఎలక్ట్రిక్ బస్సులు

పర్యావరణహిత రవాణాకు మరో ముందడుగు

Suryapet | సూర్యాపేట జిల్లాలో కొత్తగా 45 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో 45 ఎలక్ట్రిక్ బస్సులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంత‌రం మంత్రులు, ఎమ్మెల్యేలు ఎల‌క్ట్రిక్ బస్సులో ప్రయాణించారు. రాష్ట్రంలో కాలుష్యం, క‌ర్బ‌న‌ ఉద్గారాల‌ను త‌గ్గించేందుకు డీజిల్ వాడకాన్ని ప‌రిమితం చేయాల‌నే లక్ష్యంతో త‌మ‌ ప్రభుత్వం ఎల‌క్ట్రిక్ బస్సులపై దృష్టి పెట్టింద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క అన్నారు.

సూర్యాపేట ఆర్‌టీసీ డిపోకు  79 బ్యాటరీ బస్సులు మంజూరు కాగా ఈరోజు 45 బ్యాటరీ బస్సులు ప్రారంభించుకోవడం చారిత్రాత్మకమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం ఈవీ బస్ులను ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాద్ మహా నగరాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు ఓఆర్ఆర్ (ORR) లోపల 2800 బ్యాటరీ బస్సులు మంత్రి పొన్నం ప్రవేశపెట్టారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.

Bhatti Vikramarka

పథకం ప్రారంభం నాటి నుంచి ఈరోజు వరకు 182 కోట్ల జీరో టికెట్లు ఆర్టీసీ మంజూరు చేసిందని ఆడబిడ్డల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 6088 కోట్లు ప్రజా ప్రభుత్వం చెల్లించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయి ఆక్యూపెన్సీతో నడుస్తున్నాయని చెప్పారు. ఉచిత టికెట్ల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరించకపోతే ఆర్టీసీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండేద‌ని భట్టి విక్రమార్క అన్నారు.

హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *