Ogranic Farming

Turmeric board | నిజామాబాద్‌ నుంచి దేశవ్యాప్తంగా పసుపు వికాసం..
Ogranic Farming

Turmeric board | నిజామాబాద్‌ నుంచి దేశవ్యాప్తంగా పసుపు వికాసం..

పసుపు బోర్డు ప్రారంభించిన అమిత్ షా భారత్ పసుపుకు అంతర్జాతీయ గుర్తింపు లక్ష్యం ఎగుమతులకు ఊతమిస్తుందని కేంద్ర మంత్రి హామీ నిజామాబాద్ (nizamabad ) లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని(Turmeric board ) కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (home minister amit shah) ఆదివారం లాంచ‌నంగా ప్రారంభించారు.. అలాగే పసుపు బోర్డు కార్యాలయంలో ఏర్పా టు చేసిన పసుపు ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన కిసాన్ సమ్మేళన్ సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.షా..నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకోసం ఎంపీ అర్వింద్​కేంద్రంతో కొట్లాడారని గుర్తుచేశారు. జాతీయ పసుపు బోర్డు (Turmeric board) లక్ష్యాలు పసుపు పంటపై అవగాహన, వినియోగం పెంచడం భారతదేశంలో పసుపు వినియోగాన్ని పెంచే లక్ష్యంతో, దాని...
Oil Palm | ఒకే రోజు 557 ఎక‌రాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్..
Ogranic Farming

Oil Palm | ఒకే రోజు 557 ఎక‌రాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్..

Oil Palm Plantation | రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల , మంచాల, కందుకూరు, తలకొండపల్లి, ఫరుఖ్ నగర్ మండలాలలోని 111 మంది రైతులకు సంబంధించిన 557 ఎకరాలలో సుమారు 32000 ఆయిల్ పామ్ మొక్కలు నాటారు.చేవెళ్ల మండలం, దేవుని ఎర్రవెల్లిలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.12,000 మాత్రమే ఉందని, కాని తమ ప్రభుత్వ కృషి కారణంగా ఇప్పుడు ధర రూ. 18748 గా చేరిందని అన్నారు. రైతులు సంప్రదాయ పంటల స్థానంలో వాణిజ్య పంటలైన ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలని కోరారు. ఒకసారి ఆయిల్ పామ్ పంట సాగు చేస్తే దాదాపు 30 ఏళ్ల వరకు ఆదాయం వస్తుందని అన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ఆయిల పామ్ పంటలకు డ్రిప్ పరికరాలు సబ్సిడీపై అందజేయాలన్నారు. ఎంఐడీహెచ్‌ పథక...
Bengaluru | నగరంలో120 ఎకరాల అటవీ భూమిలో ఆక్రమణల‌ తొలగింపు
Ogranic Farming

Bengaluru | నగరంలో120 ఎకరాల అటవీ భూమిలో ఆక్రమణల‌ తొలగింపు

బెంగళూరు (Bengaluru) తూర్పు తాలూకాలోని బిదరహళ్లి హోబ్లిలో ఉన్న కడుగోడి తోటలోని సర్వే నంబర్ 1లోని 120 ఎకరాల ఆక్రమణకు గురైన అటవీ భూమిని అటవీ శాఖ సోమవారం స్వాధీనం చేసుకుంది. అటవీ, పర్యావరణ శాఖ‌ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆదేశాల మేర‌కు బెంగళూరు అర్బన్ ఫారెస్ట్ డివిజన్ అధికారులు ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. భారీ యంత్రాల సహాయంతో, గట్టి పోలీసు భద్రత న‌డుమ ఈ డ్రైవ్ నిర్వహించబడిందని ఒక అధికారి తెలిపారు. ఆక్రమణలను తొలగించిన తర్వాత, ఆ శాఖ అటవీ భూమి సరిహద్దులను గుర్తించి, దీర్ఘకాలిక పర్యావరణ పునరుద్ధరణ ప్రయత్నంలో భాగంగా ఆ ప్రాంతంలో మొక్కలను నాటారు. "అటవీ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. ఈ ఆపరేషన్‌లో భాగంగా, నగరంలో ప‌చ్చ‌దాన్ని రక్షించే దిశగా మేము ఒక పెద్ద అడుగు వేశాం. వందలాది ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. గత రెండు సంవత్సరాలుగా నిరంతర ప్రయత్నాల ద్వారా, బెంగళూరు న...
Rythu Nestam | 16న రైతునేస్తం కార్యక్రమం: రైతులతో ముఖాముఖి మాట్లాడనున్న సీఎం రేవంత్ రెడ్డి
Ogranic Farming

Rythu Nestam | 16న రైతునేస్తం కార్యక్రమం: రైతులతో ముఖాముఖి మాట్లాడనున్న సీఎం రేవంత్ రెడ్డి

Rythu Nestam | హైదరాబాద్ : వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈనెల 16న జరగనున్న రైతునేస్తం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రైతులతో ముఖాముఖి మాట్లాడతారని, ఆ ప్రసారాన్ని అన్ని రైతునేస్తం కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారని కలెక్టర్లకు తెలిపారు. ప్రతినిధులను ఆహ్వానించి, ప్రతి ప్రాంతం నుంచి కనీసం 250 మంది రైతులు హాజరయ్యేలా చూసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్లను కోరారు. మరో 1000 కేంద్రాల్లో అందుబాటులోకి వీడియో కాన్ఫరెన్స్ ఈ కార్యక్రమం (Rythu Nestam) ద్వారా రైతులు వ్యవసాయ నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సీఎస్ రామకృష్...
Mango Festival 2025 : గిరిజన రైతుల ఆధ్వర్యంలో మామిడి పండుగ
Ogranic Farming

Mango Festival 2025 : గిరిజన రైతుల ఆధ్వర్యంలో మామిడి పండుగ

Bhubaneswar : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని నాయపల్లిలోని నాబార్డ్ (NABARD) ప్రాంతీయ కార్యాలయ ప్రాంగణంలో ఈరోజు వార్షిక మామిడి పండుగ (Annual Mango Festival) ప్రారంభమైంది. ఒడిశాలోని ఉత్తమ మామిడి పండ్లను తీసుకువచ్చింది. ఈ ఉత్సవం 2025 జూన్ 10 నుండి 12 వరకు జరుగుతుంది. మామిడి పండుగ (Mango Festival) అనేది నాబార్డ్ యొక్క ప్రధాన గిరిజన అభివృద్ధి నిధి (TDF) చొరవలో భాగం. గిరిజన కుటుంబాలలో చిన్న పండ్ల తోటల సాగు చేసి వాటి ద్వారా జీవనోపాధిని పెంపొందించేందుకు 2003-04లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రయత్నానికి మామిడి తోటల పెంపకంతో క్షీణించిన భూములను ఆదాయ-ఉత్పాదక ఆస్తులుగా మార్చింది. రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని 83 ప్రాజెక్టులలో 57,000 కంటే ఎక్కువ గిరిజన కుటుంబాల జీవితాలను ఈ పథకం మార్చివేసింది. అంతేకాకుండా, నాబార్డ్ "ఎగుమతి పఠశాల" అని పిలువబడే సహకార చొరవ ద్వారా ఒడిశా నుండి మామిడి ఎగుమతులను చురుకుగా ప...
Bridgeston | బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా నుంచి మహిళల ఆధ్వర్యంలో పండ్ల తోటలు
Ogranic Farming

Bridgeston | బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా నుంచి మహిళల ఆధ్వర్యంలో పండ్ల తోటలు

Madhya Pradesh : బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా (Bridgestone India), సొసైటీ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ అగ్రికల్చరల్ సస్టైనబిలిటీ (Sagest) సహకారంతో, మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని సులావాద్ గ్రామంలో పోషకాహార పండ్ల తోటల ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. పర్యావరణ సుస్థిరత, మహిళల సాధికారతకు అనుకూలంగా, ఈ కొత్త ప్రయత్నం ప్రారంభించింది. సులావాద్ గ్రామంలో సొసైటీ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ అగ్రికల్చరల్ సస్టైనబిలిటీ (SAGEST తో కలిసి “ఆర్చర్డ్ ప్రాజెక్ట్”ను ప్రారంభించింది.ఈ ప్రాజెక్టులో భాగంగా, 4 ఎకరాల్లో విస్తరించి ఉన్న తోటలో 1300 పైగా పండ్ల మొక్క‌లు నాటారు. గ్రామీణ మహిళలు తోట నిర్వహణను స్వయంగా చేపట్టి, సేంద్రియ విధానంలో నర్సరీలు, కంపోస్ట్ తయారీలో శిక్ష‌ణ పొందడంతోపాటు ఉపాధి ల‌భించ‌నుంది. సుస్థిరమైన వ్యవసాయం ద్వారా గ్రామీణ మహిళలకు తోడ్పాటునందించ‌డం, పర్యావరణ పద్ధతులను ప్రోత్సహించడం పోషకాహార శ్రేయస్సుకు దోహదపడటం ఈ క...
స‌బ్సిడీపై ప‌చ్చిరొట్ట విత్త‌నాలు – Jeeluga seeds
Ogranic Farming

స‌బ్సిడీపై ప‌చ్చిరొట్ట విత్త‌నాలు – Jeeluga seeds

హైద‌రాబాద్ : వానాకాలం 2025 కి గాను పచ్చిరొట్ట విత్తనాలను (Jeeluga seeds) సబ్సిడీపై పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, నేషనల్ సీడ్ కార్పొరేషన్ విత్తనాల ద్వారా పంపిణీ చేయడానికి వ్యవసాయశాఖ ఒప్పందం చేసుకుంది. . ఇప్పటివరకు 89,302.10 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను ఆగ్రో రైతు సేవ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పంపిణీకి సిద్ధం చేసింది. ఇప్పటివరకు 1,17,912 మంది రైతులు 56,262.10 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను కొనుగోలు చేశారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 33,040 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే నేషనల్ సీడ్ కార్పోరేషన్ తమకు కేటాయించిన జిలుగ విత్తనాల ఇండెట్ కు బదులు ఇతర రాష్ట్రాలలో పంపిణీ చేస్తున్న 5 రకాల విత్తనాలు గల 5kg కిట్లను సరఫరా చేయడానికి ముందుకు రాగా, రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఆదేశాల మేరకు, రైతులక...
Climate Change | ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన అరటి పండుపై వాతావరణ మార్పు ప్రభావం?
Ogranic Farming

Climate Change | ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన అరటి పండుపై వాతావరణ మార్పు ప్రభావం?

Climate Change | ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పండు, అలాగే నాల్గవ అతి ముఖ్యమైన ఆహార పంట అయిన అరటి, వాతావరణ మార్పుల కారణంగా భారీ నష్టాన్ని చవిచూడవచ్చని క్రిస్టియన్ ఎయిడ్ (Christian Aid) నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడే పండు అరటిపండ్లు. వాస్తవానికి, 400 మిలియన్లకు పైగా ప్రజలు తమ రోజువారీ కేలరీలలో 15 నుండి 27 శాతం వరకు వీటిపై ఆధారపడతారు. అయితే, ఎగుమతి చేయబడిన అరటిపండ్లలో ఎక్కువ భాగం కావెండిష్ అనే ఒకే రకానికి చెందినవి. కానీ జన్యు వైవిధ్యం లేకపోవడం వల్ల పంట దుర్బలంగా మారుతుంది. 2080 నాటికి, లాటిన్ అమెరికా ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమవుతుందని, దీని వలన అరటి ఉత్పత్తికి అనువైన ప్రాంతం 60 శాతం తగ్గుతుందని నివేదిక పేర్కొంది. "2050 నాటికి, భారత్, బ్రెజిల్ వంటి దేశాలు వాతావరణ మార్పుల (Climate Change) కారణంగా దిగుబడి తగ్గుతాయని, కొలంబియా, కోస్టా రికా వంటి కీ...