Bajaj Chetak 2025 | బజాజ్ చేతక్ లైనప్ పూర్తి వివరాలు

ధరలు, స్పెక్స్, రేంజ్, ఫీచర్ల మధ్య తేడాలు ఇవే!

బజాజ్ ఆటో (Bajaj Auto) భారతదేశంలో చేతక్ (Cetak) సిరీస్ ను శ్రేణిని అప్ డేట్ చేసింది. చేతక్ 3001 అనే కొత్త బేస్ వేరియంట్‌ను ఇటీవలే ప్రవేశపెట్టింది. బజాజ్ చేతక్ EV శ్రేణి ఇప్పుడు నాలుగు వేరియంట్‌లను కలిగి ఉంది. అవి 3001, 3503, 3502, 3501. అయితే బజాజ్ చేతక్ కొనాలని చూస్తున్న వారికి, ఏ వేరియంట్‌ను ఎంచుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. చేతక్ లో వేరయంట్లలోని ఫీచర్లు, ఎక్స్ షోరూం ధరల గురించి ఈ కథనంలో తెలుసుకోండి..

Bajaj Chetak 2005 వేరియంట్‌లు, బ్యాటరీ లక్షణాలు..

Bajaj Chetak 3001 అనేది చేతక్ శ్రేణిలో ఎంట్రీ-లెవల్ వేరియంట్, దీని ధర రూ. 99,900. చేతక్ 3001 వేరియంట్ 3kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది పూర్తి ఛార్జ్ నుంచి 127 కి.మీ. క్లెయిమ్డ్ రేంజ్‌ను అందిస్తుంది. ఛార్జ్ విషయానికొస్తే.. 3001 0–80% నుండి ఛార్జ్ కావడానికి దాదాపు 3 గంటల 50 నిమిషాలు పడుతుంది.

చేతక్ 35 సిరీస్ (3503, 3502, 3501) 3.5kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. చేతక్ 3501, 3502 వేరియంట్లు 153 కిమీల రేంజ్‌ను కలిగి ఉంటాయి. అయితే 3503 పూర్తి ఛార్జ్‌తో 151 కి.మీ.ల రేంజ్‌ను పొందుతుంది. టాప్ స్పీడ్ కూడా మారుతూ ఉంటుంది. ఎందుకంటే 3503 63 కి.మీ.లకు పరిమితం చేశారు. మిగిలిన రెండు మోడళ్లు 73 కి.మీ.ల గరిష్ట వేగాన్ని చేరుకోగలవు.

2005 Bajaj Chetak వేరియంట్‌లు — ఫీచర్లు

ఛార్జింగ్ విషయానికొస్తే.. 35 సిరీస్‌తో కూడా స్వల్ప తేడాలు ఉన్నాయి. 3502, 3503 వేరియంట్లు 900w ఛార్జర్‌తో పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3 గంటల 25 నిమిషాలు పడుతుంది. అయితే రేంజ్ లో అగ్రస్థానంలో ఉన్న 3501 వేరియంట్ 950w ఆన్‌బోర్డ్ ఛార్జర్ కారణంగా పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3 గంటలు పడుతుంది.

Bajaj Chetak ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే, చేతక్ 3001, 3503 లలో కాల్, మెసేజ్ అలర్ట్‌లతో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. వాటికి మ్యూజిక్ ఫంక్షన్, రివర్స్ ఆప్షన్ మరియు హిల్-హోల్డ్ అసిస్ట్ కూడా లభిస్తాయి. బజాజ్ చేతక్ యొక్క రెండు వేరియంట్లలో ముందు, వెనుక వైపున డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

బ్యాటరీ & రేంజ్ వివరాలు:

వేరియంట్బ్యాటరీ సామర్థ్యంరేంజ్ (CLAIMED)ఛార్జింగ్ సమయంటాప్ స్పీడ్
Chetak 30013.0 kWh127 కిమీ3గం 50నిమి (0–80%)63 కిమీ/గం
Chetak 35033.5 kWh151 కిమీ3గం 25నిమి (900W చార్జర్)63 కిమీ/గం
Chetak 35023.5 kWh153 కిమీ3గం 25నిమి (900W చార్జర్)73 కిమీ/గం
Chetak 35013.5 kWh153 కిమీ3గం (950W చార్జర్)73 కిమీ/గం

Bajaj Chetak యొక్క రెండు హై ఎండ్ వేరియంట్‌లు – 3502, 3501 – TFT ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ను కలిగి ఉంటాయి, రెండోది టచ్‌స్క్రీన్ డాష్‌ను కలిగి ఉంటుంది. TecPacని ఎంచుకుంటే స్కూటర్‌లు ఓవర్‌స్పీడ్ అలర్ట్, గైడ్-మీ-హోమ్ లైట్లు, వెహికల్ ఇమ్మొబిలైజేషన్, మ్యూజిక్ కంట్రోల్‌లతో వస్తాయి. అలాగే డిస్క్ బ్రేక్‌ను కూడా పొందుతాయి. అయితే, శ్రేణిలో అగ్రస్థానంలో ఉన్న బజాజ్ చేతక్ 3501 వేరియంట్ కీలెస్ ఇగ్నిషన్ మరియు సీక్వెన్షియల్ ఇండికేటర్‌లను పొందుతుంది.

ధరల వివరాలు:

వేరియంట్షోరూమ్ ధర (రూ.)
Chetak 3001₹99,900
Chetak 3503₹1.02 లక్షలు
Chetak 3502₹1.22 లక్షలు
Chetak 3501₹1.35 లక్షలు

హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *