
ZELIO E-Mobility జూలై 2025లో తన Logix కార్గో స్కూటర్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఆవిష్కరించనుంది. ఇది మునుపటి మోడల్ 90-కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగా కొత్త వేరియంట్ సింగిల్ ఛార్జ్‌కు 120 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. హర్యానాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీదారు ఈరోజు లాంచ్‌ను ప్రకటించింది.
ఆధునీకరించిన లాజిక్స్ (Logix ) ఎలక్ట్రిక్ స్కూటర్ గిగ్ వర్కర్లు, డెలివరీ బాయ్స్, లాస్ట్ మైల్ లాజిస్టిక్స్ కార్యకలాపాల కోసం తీసుకువచ్చారు. స్కూటర్ లో 60/72V BLDC మోటార్ కాన్ఫిగరేషన్, 25 కిమీ/గం గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఈ వాహనం 150 కిలోగ్రాముల వరకు లోడ్‌లను మోయగలదు. పూర్తి ఛార్జ్‌కు 1.5 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది.
ఈ స్కూటర్ బూడిద, ఆకుపచ్చ రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. పట్టణ, సెమీ-అర్బన్ మార్కెట్లలో అధిక-వాల్యూమ్ డెలివరీ అవసరాలకు పరిష్కారంగా కంపెనీ నవీకరించబడిన మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ZELIO E-మొబిలిటీ కంపెనీని 2021లో స్థాపించారు. భారతదేశం అంతటా 400 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌ల నెట్‌వర్క్‌ను నిర్మించింది. కంపెనీ 200,000 కంటే ఎక్కువ మంది కస్టమర్లకు సేవలందించిందని, 2025 చివరి నాటికి 1,000 డీలర్‌షిప్ స్థానాలకు విస్తరించాలని యోచిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. డెలివరీ సేవల కోసం భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అనేకం మార్కెట్‌లోకి వస్తున్నాయి. లాజిక్స్ వంటి కార్గో స్కూటర్లు విస్తరిస్తున్న ఇ-కామర్స్, ఫుడ్ డెలివరీ రంగాలకు సేవలు అందిస్తున్నాయి. కాగా
నవీకరించబడిన లాజిక్స్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ కార్గో వాహన విభాగంలో పోటీపడుతుంది, అనేక రాష్ట్రాల్లో సాంప్రదాయ వాహన రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..