TVS iQube ని ఒక సక్సెస్ ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మారడానికి కారణాలు ఏమిటి?

ఈ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్, కాంబో-బ్రేకింగ్ సిస్టమ్, డిజిటల్ డాష్, LED లైటింగ్, హెల్మెట్‌కు సరిపోయేంత అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి.

డిజైన్ విషయానికి వస్తే. చూడ్డానికి పెట్రోల్ స్కూటర్ మాదిరిగానే కనిపిస్తుంది. జనసమూహంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఛార్జింగ్ ఇబ్బంది లేనిది. మీ ప్రయాణాలు తక్కువగా ఉంటే, TVS iQube బేస్ వేరియంట్ చక్కగా సరిపోతుంది

TVS iQube కు దాని పోటీదారుల మాదిరిగా ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్లు లేవు, కానీ రోజువారీ ప్రయాణాలు 50 కి.మీ కంటే తక్కువ ఉంటే దీనిని తీసుకోవచ్చు.

ఎకో మరియు పవర్. మొదటిది 44kmph గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది, అయితే రెండోది 75kmph స్పీడ్ అందిస్తుంది.. యాక్సిలరేషన్ బాగుంటుంది. నగరంలోని రోడ్లకు ఇది చక్కగా సరిపోతుంది.