హైదరాబాద్ కు 2వేల ఎలక్ట్రిక్ బస్సులు – PM e drive scheme

హైదరాబాద్ నగర వాసులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం (PM e drive scheme) కింద 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హైదరాబాద్‌కు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయించాల‌ని నిర్ణయించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ, గుజరాత్, దిల్లీ, క‌ర్ణాట‌క‌ రాష్ట్రాలకు బస్సుల కేటాయింపుపై దృష్టి సారించారు. ఈ పథకం కింద హైదరాబాద్‌తో పాటు బెంగళూరుకు 4,500, దిల్లీకి 2,800, అహ్మదాబాద్‌కు 1,000, సూరత్‌కు 600 ఎలక్ట్రిక్ బస్సులను అందజేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

ఈవిష‌య‌మై కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో భార‌త‌దేశం ప్రస్తుతం సుస్థిర పట్టణ రవాణా దిశగా వేగంగా అడుగులు వేస్తోంద‌ని అన్నారు. బెంగళూరు నుంచి దిల్లీ వరకు, నగరాలు ప్రజా రవాణాను మరింత పరిశుభ్రంగా, కాలుష్య ర‌హితంగా మార్చేందుకు ఈవీ బస్సులను పెంచుతున్నామ‌ని అన్నారు. పర్యావరణ పరిరక్షణతో భారత రవాణా వ్యవస్థ భవిష్యత్తును స‌మూలంగా మార్చివేస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పీఎం ఈ-డ్రైవ్ హామీని నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి తెలిపారు.

PM e drive scheme : 10,900 కోట్లతో 14వేల బస్సులు

పీఎం ఈ-డ్రైవ్ పథకం (PM e drive scheme) ద్వారా 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.10,900 కోట్ల వ్యయంతో 14,028 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాల‌ని నిర్ణ‌యించామ‌ని మంత్రి కుమార‌స్వామి తెలిపారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ చొర‌వ‌లో ఒకటిగా నిలుస్తుందని ఆయన తెలిపారు. పీఎం ఈ-డ్రైవ్ కింద ఈ-ఆంబులెన్స్‌లు, ఈ-ట్రక్కులను కూడా కేంద్రం అందుబాటులోకి తీసుకురానుందన్నారు. ఇందుకు రూ.500 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు.

హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *