
TVS iQube ఒక విజయవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని అద్భుతమైన డిజైన్, ఆకట్టుకునే పనితీరుతో ఈవీ వినియోగదారుల మన్ననలు పొందుతోంది. TVS iQube బేస్ మోడల్ ధర రూ. 1.07 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇందులో 2.2kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుపరిచారు. ఇది 75kmph రియల్ రేంజ్ ఇస్తుుంది. గంటకు 75kmph గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. దీనితోపాటు వచ్చే ఆఫ్-బోర్డ్ ఛార్జర్‌తో 2 గంటల 45 నిమిషాల్లో 0-80% వరకు ఛార్జ్ చేయబడుతుందని TVS Motor company చెబుతోంది.

రైడర్లకు కావాల్సిన కనీస సౌకర్యాలు..
ఈ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్, కాంబో-బ్రేకింగ్ సిస్టమ్, డిజిటల్ డాష్, LED లైటింగ్, హెల్మెట్‌కు సరిపోయేంత అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. కాబట్టి మొత్తం మీద, ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి తగినంత ఫీచర్లతో కూడిన స్కూటర్.
TVS iQube : వాస్తవ అనుభవం ఇలా..
ఒక లివర్ ను తిప్పి కీని ఆన్ చేస్తే, డిస్ప్లే కొన్ని సెకన్లు పడుతుంది. ఇది కాస్త అసౌకర్యంగా అనిపిస్తుంది. అయితే, మీరు స్టార్ట్ బటన్‌ను ఎక్కువసేపు నొక్కిన తర్వాత, మోటారు బీప్‌తో ఆన్ అవుతుంది. ఇందులో రెండు మోడ్స్ ఉన్నాయి. – ఎకో మరియు పవర్. మొదటిది 44kmph గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది, అయితే రెండోది 75kmph స్పీడ్ అందిస్తుంది. యాక్సిలరేషన్ బాగుంటుంది. నగరంలోని రోడ్లకు ఇది చక్కగా సరిపోతుంది.

స్కూటర్ ఎక్కువ సమయం ట్రాఫిక్‌లో నడిపినప్పటికీ, రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉన్నపుడు అప్పుడప్పుడు పవర్ మోడ్‌ను ఉపయోగించవచ్చు. పవర్ మోడల్ లో రైడింగ్ చేసేటప్పుడు నమ్మకంగా ఉంటుంది. అది వారిని నమ్మకంగా తీసుకువెళుతుంది. దీని నుంచి పెద్దగా శబ్దం కూడా రాదు.
డిజైన్ విషయానికి వస్తే. చూడ్డానికి పెట్రోల్ స్కూటర్ మాదిరిగానే కనిపిస్తుంది. జనసమూహంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఛార్జింగ్ ఇబ్బంది లేనిది. మీ ప్రయాణాలు తక్కువగా ఉంటే, TVS iQube బేస్ వేరియంట్ చక్కగా సరిపోతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్న వారు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి.

TVS iQube కు దాని పోటీదారుల మాదిరిగా ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్లు లేవు, కానీ రోజువారీ ప్రయాణాలు 50 కి.మీ కంటే తక్కువ ఉంటే దీనిని తీసుకోవచ్చు.తప్పనిసరిగా ఛార్జ్ చేయాల్సి వస్తే, ఏదైనా టీవీఎస్ సర్వీస్ స్టేషన్ లో ఉచితంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 1,364 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
[…] జెలియో E మొబిలిటీ స్కూటర్ దాని శక్తివంతమైన కొత్త గ్రాఫిక్స్, […]