
2025 Top Electric scooters Under Rs One lakh | కొన్నాళ్లుగా పెట్రోల్ ధరలు ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో వాహనదారులు ఇపుడు ఎలక్ట్రిక్ వాహనాలపై చూస్తున్నారు. ఇదే సమయంలో పలు కార్పొరేట్ కంపెనీలు సైతం ఉన్నత, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ధరలోనే విభిన్న రకాలైన ఈవీ (EV) మోడళ్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగానికి ఆర్థిక సంవత్సరంలో 2025 ఏప్రిల్ లో అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాలు (Electric scooters) అమ్ముడయ్యాయి. వాహన్ డేటా ఆధారంగా, గత నెలలో భారతదేశంలో స్కూటర్లు, బైక్‌లు, మోపెడ్‌లతో సహా 91,791 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు (E2Wలు) అమ్ముడయ్యాయి. ఇది 40% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఇది 2023లో ఏప్రిల్‌లో జరిగిన మునుపటి ఉత్తమ అమ్మకాలను మించిపోయింది. మార్కెట్లో రూ. 1 లక్ష లోపు డబ్బుకు అత్యంత విలువైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ఒకసారి లుక్కేయండి..

ఓలా S1 X 2 kWh ధర రూ. 73,999
Top 5 Electric scooters : ఓలా ఎలక్ట్రిక్ 2 kWh బ్యాటరీ ప్యాక్‌తో S1 X నుంచి ప్రారంభమయ్యే విస్తృత శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కలిగి ఉంది. ఇది 9.3 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 3.4 సెకన్లలో 0 – 40 kmph వేగాన్ని అందుకుంటుంది. IDC ఆధారంగా, సింగిల్ చార్జిపై ఇది 108 కి.మీ రేంజ్ ఇస్తుంది. గంటకు 101 కి.మీ గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. దీనికి స్పోర్ట్స్, నార్మల్, ఎకో అనే మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి, 4 గంటల 50 నిమిషాల్లో 0 – 80% వరకు బ్యాటరీ ఛార్జ్ చేయగలదు.

టీవీఎస్ ఐక్యూబ్ —రూ. 94,434
iQube ఎంట్రీ-లెవల్ ట్రిమ్ 2.2 kWh బ్యాటరీతో శక్తిని కలిగి ఉంది. ఇది 5.9 bhp అవుట్‌పుట్, 140 Nm టార్క్‌ను కలిగి ఉంటుంది. కంపెనీ ప్రకారం, ఇది 4.2 సెకన్లలో 0 – 40 kmph వేగాన్ని అందుకుంటుంది. 75 kmph వేగంతో ప్రయాణిస్తుది. సింగిల్ చార్జిపై 75 km రేంజ్ ఇస్తుంది. ఇది 157 mm గ్రౌండ్ క్లియరెన్స్, 770 mm సీటు ఎత్తును కలిగి ఉంటుంది. ఇది 5-అంగుళాల TFT డిస్‌ప్లేతో అమర్చబడి 2 గంటల 45 నిమిషాల్లో 0 – 80% వరకు ఛార్జ్ చేయగలదు.

Hero Vida V2 Lite — రూ 74,000
హీరో విడా 2 లైట్ అనేది 2.2 kWh రిమూవబుల్ బ్యాటరీ ఇందులో ఉంటుంది. 94 కి.మీ.ల IDC రేంజ్ తో వచ్చే ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది 4.2 కి.మీ.లలో 0 – 40 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 69 కి.మీ.ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 7-అంగుళాల TFT డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు రైడ్ మోడ్‌లు ఎకో, స్పోర్ట్ ఉంటాయి. . ఇది 26 లీటర్ బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది.

బజాజ్ చేతక్ 2903 — రూ 98,498
బజాజ్ చేతక్ 2903 2.9 kWh బ్యాటరీతో 5.3 bhp అవుట్‌పుట్‌తో వస్తుంది. సింగిల్ చార్జిపై ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 123 కి.మీ.ల రేంజ్ ను ఇస్తుంది. 4 గంటల్లో 0 – 80% వరకు ఛార్జ్ అవుతుంది. ఇందులో హిల్ హోల్డ్, రెండు రైడ్ మోడ్‌లు – ఎకో, స్పోర్ట్, రంగు LCD డిజిటల్ క్లస్టర్, కాల్స్, నోటిఫికేషన్‌లు, మ్యూజిక్ ప్లే చేయడానికి బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి .

Top Electric scooters : ఓలా S1 X 3 kWh — రూ. 97,999
S1 X 3 kWh అనేది 2 kWh మోడల్ కంటే ఒక అడుగు ముందు ఉంటుంది. 7.3 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 3.1 సెకన్లలో 0 నుండి 40 kmph వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 115 kmph. మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి – ఎకో, నార్మల్, స్పోర్ట్స్. ఇది డిజిటల్ కీతో అమర్చబడి 7-అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లేను కలిగి ఉంది.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..